IPL కోసం జియో నెట్ హై-స్పీడ్ వై-ఫై సేవలు

jio-net-wifiహైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ప్రారంభమైన 10వ IPL మ్యాచ్ లకు రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్ (RJIL) తమ హై-స్పీడ్, వై-ఫై ఇంటర్నెట్ సేవలను జియో నెట్ ద్వారా అందిస్తోంది.

రిలయన్స్ జియో ప్రస్తుత IPL సీజన్ కోసం తమ జియో నెట్ వై-ఫై తో స్టేడియం మొత్తం కవర్ చేసింది. క్రికెట్ తిలకించడానికి వచ్చిన అభిమానులు తమ స్మార్ట్ ఫోన్ లలో, జియో నెట్ ద్వారా హై-స్పీడ్ వై-ఫై సేవల యొక్క ప్రయోజనాలను పొందుతారు.

ఈ సేవల కోసం, ప్రేక్షలకు కావలసింది ఒక స్మార్ట్ ఫోన్ మాత్రమే. వై-ఫై కి కనెక్ట్ అయిన తరువాత, జియో నెట్ హోం పేజీ లో ఇచ్చిన మొబైల్ నంబరుకి OTP వస్తుంది. OTP ని జోడించగానే వై-ఫై కనెక్ట్ అవుతుంది.

జియో సమ్మర్ సర్ ప్రైస్ ఆఫర్: ఇటీవల ప్రకటించిన ‘జియో సమ్మర్ సర్ ప్రైస్ ఆఫర్ లో భాగంగా జియో వినియోగదారులు రూ99+303 రీఛార్జిలతో జులై వరకు నిరంతరాయంగా వాయిస్, డేటా సేవలను పొందవచ్చు.

Advertisements

నిజాం కాలేజీలో జియో హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు

JioNet Launch at Nizam Collegeటెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తోన్న రిలయన్స్ జియో, నగరంలోని అత్యంత పురాతన, ప్రముఖ విద్యా సంస్థ నిజాం కాలేజీలో  జియో నెట్ హై-స్పీడ్ వైఫై సేవలను ప్రారంభించింది. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో సి హెచ్ గోపాల్ రెడ్డి ఈ సేవలను మంగళవారం నిజాం కాలేజీ ఆడిటోరియంలో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం కాలేజీ లాంటి పాత విద్యా సంస్ధ సరికొత్తగా డిజిటల్ సేవలతో ముందుకు దూసుకెళ్ళడం సంతోషంగా ఉందన్నారు. ఈ వై ఫై సేవలను స్టాఫ్, విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. కాలేజీ ప్రిన్సిపాల్ సయ్యద్ రెహ్మాన్, వైస్ ప్రిన్సిపాల్ బాలబ్రహ్మచారి, జియో ప్రతినిధులు రమణ సురభి, మధుసూదన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జియో డిజిటల్ క్యాంపస్ పేరిట, రిలయన్స్ జియో తెలంగాణ వ్యాప్తంగా 500 పైగా కాలేజీలలో జియో నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇటీవల ప్రకటించిన ‘జియో సమ్మర్ సర్ ప్రైస్ ఆఫర్ లో భాగంగా జియో వినియోగదారులు రూ99+303 రీఛార్జిలతో  మూడు నెలల పాటు నిరంతరాయంగా వాయిస్, డేటా సేవలను పొందవచ్చు.

ఇంటర్నెట్ స్పీడ్ పై ఎయిర్ టెల్ అసత్య ప్రచారం: జియో

img_20170313_205738.jpg

ఈ మధ్య టీవీల్లో… ఇంటర్నెట్ లో ఎయిర్ టెల్ దేశం లో తమదే వేగవంతమైన నెట్ వర్క్ అని చెప్పుకుంటూ తప్పు దోవ పట్టిస్తుందని రిలయన్స్ జియో ఆరోపించింది.

మనందరం ఇంటర్నెట్ స్పీడ్ ను చెక్ చేయడానికి ఉపయోగించే స్పీడ్ టెస్ట్, అనే యాప్, స్పీడ్ ని పరీక్షించే విధానంలో ఉన్న ఓ పెద్ద లోపం కారణంగా తప్పుడు ఫలితాలు వస్తున్నాయని తెలుస్తోంది.

ఉదాహరణకు… మీ డ్యూయల్ సిమ్ ఫోన్ లో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ రెండు సిమ్ లు ఉన్నాయనుకుందాం. మొబైల్ డేటా కోసం రిలయన్స్ జియో నీ, కాల్స్ కోసం ఎయిర్ టెల్ నీ, సెట్ చేసుకున్నారనుకుందాం. ఇప్పుడు మీరు స్పీడ్ టెస్ట్ చేస్తే… దాని ఫలితాలను మాత్రం ఎయిర్ టెల్ కి ఆపాదిస్తుంది. రిలయన్స్ జియో నే కాదు… ఎయిర్ టెల్ తో పాటు వేరే ఏ సిమ్ మన డ్యూయల్ సిమ్ ఫోన్ లో ఉన్నా ఇలా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. అంటే కాల్స్ కోసం ఏ సిమ్ పని చేస్తుందో దానినే స్పీడ్ టెస్ట్ యాప్ పరిగణలోకి తీసుకుంటుందన్న మాట.

ఒక వివరణాత్మక వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి

Ookla Speedtest

ఈ విషయం పై ఆడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ అఫ్ ఇండియా (ASCI) వద్ద రిలయన్స్ జియో ఫిర్యాదు చేసింది. బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ టెస్ట్ సంస్థ ఊక్లాతో కుట్రలు పన్నుతూ, ఫాస్టెస్ట్ నెట్ వర్క్ తమదేనంటూ ఎయిర్ టెల్ ప్రచారం చేస్తోందని ఇదంతా అబద్ధమని, తప్పుదోవ పట్టించేదిగా ఉందని జియో ఆ ఫిర్యాదులో పేర్కొంది.