ఇదిగోండి జియో ‘ధన్ ధనా ధన్’

అందుబాటులో రూ 309, రూ 509 రీఛార్జిలు
3 నెలల పాటు అపరిమిత సేవలు

jio-dnd-759

      టెలికాం రంగంలో టారిఫ్ వార్ రోజురోజుకూ ముదిరిపోతోంది. రిలయన్స్ జియో తన ఆఫర్లతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపెడుతోంది. జియో ఉచిత సేవలు వల్ల టెల్కో లు తమ రాబడులు బాగా తగ్గి నష్టాల బాటలో విలవిలలాడుతున్న, ట్రాయ్ కు జియో ఉచిత ఆఫర్ల పై టెల్కో లు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నా, జియో మాత్రం తన ఫ్రీ ఆఫర్ల పరంపరను కొనసాగిస్తూనే ఉంది.

గత సెప్టెంబరు లో ప్రారంభమై, సుమారు 7 నెలల పాటు వినియోగదారులకు ఉచితంగా వివిధ సేవలందించిన జియో, మార్కెట్లో సంచలనాలకు తెరతీసిందనే చెప్పాలి. ఇటీవల ‘సమ్మర్ సర్ ప్రైస్ ఆఫర్’ ప్రకటించిన జియో, ట్రాయ్ ఆదేశాలతో ఆ ఆఫర్ ను తప్పని సరి పరీస్థితులలో రద్దు చేసి… తాజాగా తన ప్రైమ్ మెంబెర్స్ కోసం మరో సరికొత్త పధకం ప్రకటించింది. దీనికి జియో ‘ధన్ ధనా ధన్’ అని ముద్దు పేరు పెట్టింది.

అయితే ఈ ఆఫర్ మొదటి రీఛార్జికి మాత్రమే వర్తిస్తుందని జియో తమ వెబ్ సైట్ లో పేర్కొంది. సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ఉంటే ఇది వర్తించదు.

జియో తాజాగా ప్రకటించిన ఆఫర్లను ఒకసారి చూద్దాం.

ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న వారికి: 

రూ309 రీఛార్జితో రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్ (84 రోజుల వాలిడిటి)

రూ509 రీఛార్జితో 2GB డేటా, అపరిమిత కాల్స్ (84 రోజుల వాలిడిటి)

ఈ రెండు ఆఫర్లు జియో ప్రైమ్ మెంబర్లకు మాత్రమే పరిమితం.

ప్రైమ్ సభ్యత్వం తీసుకోని వారికి: 

రూ408 రీఛార్జితో రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్ (84 రోజుల వాలిడిటి)

రూ508 రీఛార్జితో రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్ (84 రోజుల వాలిడిటి)

Advertisements

జియో సమ్మర్ సర్ప్రైజ్ ఇలా…

ఊహించినట్టే రిలయన్స్ జియో తన ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్ ను ఆఖరి నిమిషంలో పొడిగించింది. ఇప్పుడు వినియోగదారులు ఏప్రిల్ 15లోగా జియో ప్రైమ్‌లో చేరొచ్చు. దీనికి తోడు ‘సమ్మర్ సర్‌ప్రైజ్’ పేరుతో మరో అద్భుతమైన ఆఫర్‌ను జియో ప్రారంభించింది. ఈ ప్లాన్‌ను ఎంజాయ్ చేయాలంటే మొదట రూ.99 చెల్లించి ప్రైమ్‌లో చేరాలి. తరువాత రూ. 303తో రీచార్జ్ చేసుకుంటే మూడు నెలలపాటు ‘హ్యాపీ న్యూ ఇయర్’ ప్లాన్‌లో ఉన్న అపరిమిత డాటా, అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అయితే మీరు రీచార్జ్ చేసిన రూ303 టారిఫ్ జులై నుంచి వర్తిస్తుంది. అంటే, ఈ మూడు నెలల ఉచిత ఆఫర్ అయిపోయిన తరువాత, జులై నెలకు కూడా మీరు ఎలాంటి రీచార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు.

‘జియో క్రొత్త ప్లాన్లను కొనుగోలు చేయడానికి ఆఖరి తేదీని పెంచాలని వినియోగదారులు కోరుకుంటున్నట్లు మాకు సమాచారం వచ్చింది. అందుకనే మార్చి 31తో ముగియ వలసిన గడువును ఏప్రిల్ 15 వరకు పెంచాం. ఉచిత సేవలను రుసుము చెల్లించి వాడుకునేలా చేసినప్పుడు యూజర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలని ఆఖరి తేదీని పెంచాం’ అని రిలయన్స్ జియో ఛైర్మన్ ముఖేశ్ అంబానీ మీడియాకు వెల్లడించారు.

నెల రోజుల్లోనే సుమారు 7.2 కోట్ల మంది జియో కస్టమర్లు ‘జియో ప్రైమ్’లో చేరినట్లు సంస్థ వెల్లడించింది. టెలీకాం చరిత్రలో ఇదొక అద్భుతమని, ఇంత పెద్ద మొత్తంలో కస్టమర్లు ఉచితం నుంచి చెల్లింపు సేవల్లోకి మారడం తొలిసారని పేర్కొంది. ఈ క్రమంలో జియో ప్రకటించిన తాజా ఆఫర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

jio-summer-offer

– రూ.149తో రీచార్జి చేసుకుంటే 2 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాలిడిటీ 28 రోజులు (ఇందులో మార్పు లేదు)

– రూ.303తో రీచార్జి చేసుకుంటే 28 జీబీ 4జీ డేటా (రోజుకు 1 జీబీ డేటా లిమిట్), అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాలిడిటీ 28 రోజులు (ఒక నెలకు రీచార్జి చేసుకుంటే 3 నెలలు వాడుకోవచ్చు, నెలకు అదనంగా 5 జీబీ 4జీ డేటా ఫ్రీగా వస్తుంది)

– రూ.499తో రీచార్జి చేసుకుంటే 56 జీబీ 4జీ డేటా (రోజుకు 2 జీబీ డేటా లిమిట్), అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాలిడిటీ 28 రోజులు (ఒక నెలకు రీచార్జి చేసుకుంటే 3 నెలలు వాడుకోవచ్చు, నెలకు అదనంగా 10 జీబీ 4జీ డేటా ఫ్రీగా వస్తుంది)

– రూ.999తో రీచార్జి చేసుకుంటే 60 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాలిడిటీ 60 రోజులు (ఒకసారి రీచార్జి చేసుకుంటే 3 నెలల వాలిడిటీతో అదనంగా 100 జీబీ ఉచిత డేటా వస్తుంది)

– రూ.1999తో రీచార్జి చేసుకుంటే 125 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాలిడిటీ 90 రోజులు (ఒకసారి రీచార్జి చేసుకుంటే 3 నెలల వాలిడిటీతో అదనంగా 100 జీబీ ఉచిత డేటా వస్తుంది)

– రూ.4999తో రీచార్జి చేసుకుంటే 350 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాలిడిటీ 180 రోజులు (ఒకసారి రీచార్జి చేసుకుంటే 3 నెలల వాలిడిటీతో అదనంగా 100 జీబీ ఉచిత డేటా వస్తుంది)

– రూ.9999తో రీచార్జి చేసుకుంటే 750 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాలిడిటీ 360 రోజులు (ఒకసారి రీచార్జి చేసుకుంటే 3 నెలల వాలిడిటీతో అదనంగా 100 జీబీ ఉచిత డేటా వస్తుంది)

‘జియో ప్రైమ్’ మరో వారం రోజులే…. ‘Jio Prime’ for just a week!

మార్చి 31తో ఆఖరు           *              రూ 99 కే వార్షిక సభ్యత్వం

Jio Prime Offer

రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన ‘జియో ప్రైమ్’ మెంబర్ షిప్ మరో వారం రోజులే (మార్చి 31 వరకు) అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ క్రింద  ప్రస్తుతం జియో సిమ్ కలిగిన వారు (myJio అప్ ద్వారా) రూ.99 చెల్లించి ప్రస్తుతం  అనుభవిస్తున్న సేవలను మరో ఏడాదిపాటు కొనసాగించుకోవచ్చు.

జియో ప్రైమ్ సభ్యత్వం పొందిన వారు రూ.149, రూ.303, రూ.499 తదితర నెలవారీ రీఛార్జీ ప్యాకేజీలతో ఉచిత వాయిస్

, డేటాను పొందే వీలుంది. ఇటీవల రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ ప్రకటించినట్లుగా ప్రతిరోజూ 1GB డేటాను టెలికాం రంగంలో ఎక్కడా లేనట్లుగా 10 రూపాయలకే జియో అందిస్తోంది.

జియో ప్రైమ్ మెంబర్ ఏ రీఛార్జీని ఎంపిక చేసుకున్నా, అపరిమిత ఉచిత కాల్స్ ను నెల రోజుల పాటు పొందవచ్చు. మొదటి 1000 కాల్స్ మాత్రమే ఉచితం అన్న ప్రచారం అవాస్తవం. జియో నుంచి ఇతర ఏ మొబైల్ ఆపరేటర్ కు అయినా కాల్స్ అపరిమితంగా ఉచితంగా చేసుకోవచ్చు.

వినియోగదారులు తమకు అనువైన రీఛార్జీ ప్యాకేజిని ఎంచుకోవడానికి తమ మొబైల్ లోని myjio యాప్ ని కానీ లేదా కంపెనీ వెబ్ సైట్ www.jio.com కానీ చూడవచ్చు. మార్కెట్లో అన్ని రీఛార్జీ స్టోర్ లలో కూడా (జియో ప్రైమ్) వివరాలు లభిస్తాయి.

రూ.99 అంతకంటే ఎక్కువ ప్లాన్లను జియో మనీ వ్యాలెట్, మై జియో యాప్, www.jio.com వెబ్‌సైట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. ఇలా రీచార్జ్ చేసుకున్న వారికి జియో మనీ యాప్ ద్వారా రూ.50 డిస్కౌంట్ వోచర్ లభిస్తుంది. మార్చి 25 నుంచి 30 జూన్ వరకు రీచార్జ్ చేసుకునేందుకు ఈ వోచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ గడువులో వినియోగదారుడికి ఐదుసార్లు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే దీనిని రూ.303 అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.

  • Offer starts from 15 th March, 2017 and is a limited period offer
  • Eligible Transaction is a successful Jio Plan recharge for the value of Rs. 99/-or more by using JioMoney wallet or from MyJio App and/or http://www.jio.com by logging into and making payment using JioMoney wallet during the offer period
  • Customer who makes a successful Eligible Transaction will get a Rs. 50/- discount voucher in the JioMoney app
  • The customer can redeem the discount voucher received only on the Jio Plan recharge for the value of Rs 303/- or more using JioMoney from 25 st March, 2017 till 30 th June, 2017
  • The customer can avail this offer only for 5 successful Eligible Transaction per user during the offer period
  • The customer can use one discount voucher per Jio Plan recharge of Rs. 303/- or more

 

Here is the catch!

Jio-Airtel-Vodafone-Idea-Comparison

After the launch of Jio Prime offer, all the leading incumbent telecom operators also launched similar unlimited voice and 4G data plans to counter the threat of Reliance Jio. All these plans cost around Rs. 350, and are valid for 28 days. But in contrast to what these telcos want you to believe, their tariff plans are not better than those offered by Reliance Jio in the true sense.

Read More

Jio Prime or Stick to Airtel/Vodafone?

Going by the numbers and benefits on offer, Jio Prime trumps both Airtel and Vodafone. 
Jio’s giving free voice calls, no roaming and up to 56GB of data every month till March 2018.

Airtel and Vodafone are trying their best with a new set of plans to rival Reliance Jio, but are still lagging behind. Also, the lack of clarification as to how Airtel and Vodafone will offers their packs leaves customers uncertain.

If Jio can get rid of all the voice connectivity troubles, we can see users switching their base from Airtel/Vodafone to Jio in the coming months.

Read More