నిజాం కాలేజీలో జియో హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు

JioNet Launch at Nizam Collegeటెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తోన్న రిలయన్స్ జియో, నగరంలోని అత్యంత పురాతన, ప్రముఖ విద్యా సంస్థ నిజాం కాలేజీలో  జియో నెట్ హై-స్పీడ్ వైఫై సేవలను ప్రారంభించింది. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో సి హెచ్ గోపాల్ రెడ్డి ఈ సేవలను మంగళవారం నిజాం కాలేజీ ఆడిటోరియంలో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం కాలేజీ లాంటి పాత విద్యా సంస్ధ సరికొత్తగా డిజిటల్ సేవలతో ముందుకు దూసుకెళ్ళడం సంతోషంగా ఉందన్నారు. ఈ వై ఫై సేవలను స్టాఫ్, విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. కాలేజీ ప్రిన్సిపాల్ సయ్యద్ రెహ్మాన్, వైస్ ప్రిన్సిపాల్ బాలబ్రహ్మచారి, జియో ప్రతినిధులు రమణ సురభి, మధుసూదన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జియో డిజిటల్ క్యాంపస్ పేరిట, రిలయన్స్ జియో తెలంగాణ వ్యాప్తంగా 500 పైగా కాలేజీలలో జియో నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇటీవల ప్రకటించిన ‘జియో సమ్మర్ సర్ ప్రైస్ ఆఫర్ లో భాగంగా జియో వినియోగదారులు రూ99+303 రీఛార్జిలతో  మూడు నెలల పాటు నిరంతరాయంగా వాయిస్, డేటా సేవలను పొందవచ్చు.

Advertisements