ఇంటర్నెట్ స్పీడ్ పై ఎయిర్ టెల్ అసత్య ప్రచారం: జియో

img_20170313_205738.jpg

ఈ మధ్య టీవీల్లో… ఇంటర్నెట్ లో ఎయిర్ టెల్ దేశం లో తమదే వేగవంతమైన నెట్ వర్క్ అని చెప్పుకుంటూ తప్పు దోవ పట్టిస్తుందని రిలయన్స్ జియో ఆరోపించింది.

మనందరం ఇంటర్నెట్ స్పీడ్ ను చెక్ చేయడానికి ఉపయోగించే స్పీడ్ టెస్ట్, అనే యాప్, స్పీడ్ ని పరీక్షించే విధానంలో ఉన్న ఓ పెద్ద లోపం కారణంగా తప్పుడు ఫలితాలు వస్తున్నాయని తెలుస్తోంది.

ఉదాహరణకు… మీ డ్యూయల్ సిమ్ ఫోన్ లో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ రెండు సిమ్ లు ఉన్నాయనుకుందాం. మొబైల్ డేటా కోసం రిలయన్స్ జియో నీ, కాల్స్ కోసం ఎయిర్ టెల్ నీ, సెట్ చేసుకున్నారనుకుందాం. ఇప్పుడు మీరు స్పీడ్ టెస్ట్ చేస్తే… దాని ఫలితాలను మాత్రం ఎయిర్ టెల్ కి ఆపాదిస్తుంది. రిలయన్స్ జియో నే కాదు… ఎయిర్ టెల్ తో పాటు వేరే ఏ సిమ్ మన డ్యూయల్ సిమ్ ఫోన్ లో ఉన్నా ఇలా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. అంటే కాల్స్ కోసం ఏ సిమ్ పని చేస్తుందో దానినే స్పీడ్ టెస్ట్ యాప్ పరిగణలోకి తీసుకుంటుందన్న మాట.

ఒక వివరణాత్మక వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి

Ookla Speedtest

ఈ విషయం పై ఆడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ అఫ్ ఇండియా (ASCI) వద్ద రిలయన్స్ జియో ఫిర్యాదు చేసింది. బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ టెస్ట్ సంస్థ ఊక్లాతో కుట్రలు పన్నుతూ, ఫాస్టెస్ట్ నెట్ వర్క్ తమదేనంటూ ఎయిర్ టెల్ ప్రచారం చేస్తోందని ఇదంతా అబద్ధమని, తప్పుదోవ పట్టించేదిగా ఉందని జియో ఆ ఫిర్యాదులో పేర్కొంది.