ఎదురులేని జియో స్పీడ్

Jio Digital Logoఇండియా లో ఫాస్టెస్ట్ నెట్వర్క్ మాదేనంటు ఊదరగొడుతున్న ఎయిర్టెల్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ట్రాయ్ స్పీడ్ టెస్ట్ తో ఎయిర్టెల్ వాదనకు చెక్ పెట్టినట్టు అయ్యింది. జియోను మించిన స్పీడ్ దేశంలో ఏ నెట్వర్క్ కు లేదని ఏకంగా ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ట్రాయ్ రూపొందించిన MySpeed ఆప్ ద్వారా టెస్ట్ చేసిన యూజర్లను, ప్రాతిపదికగా తీసుకుని, ఈ ఫలితాలను ట్రాయ్ విడుదల చేసింది. దీంతో రిలయన్స్ జియో వేగవంతమైన నెట్వర్క్ గా అగ్రస్థానానికి చేరింది.

భారీ ప్రచారంతో ఫాస్టెస్ట్ నెట్వర్క్ గా ప్రచారం చేసుకుంటున్న ఎయిర్టెల్ పై అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) కు, రిలయన్స్ జియో ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన ASCI… వెంటనే ఆ ప్రకటనలను ఆపివేయాలని ఎయిర్టెల్ ను ఆదేశించింది.

ఐతే రిలయన్స్ జియో ఫలితాలు జనవరితో పోలిస్తే 1 ఎంబిపిఎస్ తగ్గటం గమనార్హం. జనవరిలో 17.42 ఎంబిపిఎస్ సగటు వేగాన్ని నమోదు చేసిన జియో, ఫిబ్రవరిలో 16.48 ఎంబిపిఎస్ సగటు వేగాన్ని నమోదు చేసింది. దేశంలో రెండో అతిపెద్ద నెట్వర్క్ కంపెనీ అయిన ఐడియా 12.09 ఎంబిపిఎస్ సగటు వేగంతో రెండో స్థానంలో నిలిచింది. భారతీ ఎయిర్టెల్ 10.43 ఎంబిపిఎస్ వేగంతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. వోడాఫోన్ 7.933 ఎంబిపిఎస్ వేగాన్ని నమోదు చేసి ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.

అపరిమిత సేవలు-ఆఫర్లు: జియో ప్రైమ్ సభ్యత్వం పొందేందుకు ఈ నెల 15 వరకు గడువు పొడిగించడంతో పాటు రూ303 తో రీఛార్జి చేసుకుంటే అపరిమిత కాల్స్, అపరిమిత డేటా మరో మూడు నెలలు పొందవచ్చని రిలయన్స్ జియో ప్రకటించటం పెద్ద సంచలనమే అయ్యింది. ఉచిత సేవల ఫలితంగా సమకూరిన 10 కోట్ల మంది వినియోగాదార్లలో 7.2 కోట్ల మంది రూ99 చెల్లించి, సభ్యత్వం తీసుకున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ చందాదార్లను కాపాడుకునేందుకు పోటీ సంస్థలు కూడ రీఛార్జిలు తగ్గించడంతో పాటు అపరిమిత సేవలు ఆఫర్లు ఇప్పటికే ప్రకటించాయి.

Advertisements

ఇంటర్నెట్ స్పీడ్ పై ఎయిర్ టెల్ అసత్య ప్రచారం: జియో

img_20170313_205738.jpg

ఈ మధ్య టీవీల్లో… ఇంటర్నెట్ లో ఎయిర్ టెల్ దేశం లో తమదే వేగవంతమైన నెట్ వర్క్ అని చెప్పుకుంటూ తప్పు దోవ పట్టిస్తుందని రిలయన్స్ జియో ఆరోపించింది.

మనందరం ఇంటర్నెట్ స్పీడ్ ను చెక్ చేయడానికి ఉపయోగించే స్పీడ్ టెస్ట్, అనే యాప్, స్పీడ్ ని పరీక్షించే విధానంలో ఉన్న ఓ పెద్ద లోపం కారణంగా తప్పుడు ఫలితాలు వస్తున్నాయని తెలుస్తోంది.

ఉదాహరణకు… మీ డ్యూయల్ సిమ్ ఫోన్ లో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ రెండు సిమ్ లు ఉన్నాయనుకుందాం. మొబైల్ డేటా కోసం రిలయన్స్ జియో నీ, కాల్స్ కోసం ఎయిర్ టెల్ నీ, సెట్ చేసుకున్నారనుకుందాం. ఇప్పుడు మీరు స్పీడ్ టెస్ట్ చేస్తే… దాని ఫలితాలను మాత్రం ఎయిర్ టెల్ కి ఆపాదిస్తుంది. రిలయన్స్ జియో నే కాదు… ఎయిర్ టెల్ తో పాటు వేరే ఏ సిమ్ మన డ్యూయల్ సిమ్ ఫోన్ లో ఉన్నా ఇలా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. అంటే కాల్స్ కోసం ఏ సిమ్ పని చేస్తుందో దానినే స్పీడ్ టెస్ట్ యాప్ పరిగణలోకి తీసుకుంటుందన్న మాట.

ఒక వివరణాత్మక వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి

Ookla Speedtest

ఈ విషయం పై ఆడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ అఫ్ ఇండియా (ASCI) వద్ద రిలయన్స్ జియో ఫిర్యాదు చేసింది. బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ టెస్ట్ సంస్థ ఊక్లాతో కుట్రలు పన్నుతూ, ఫాస్టెస్ట్ నెట్ వర్క్ తమదేనంటూ ఎయిర్ టెల్ ప్రచారం చేస్తోందని ఇదంతా అబద్ధమని, తప్పుదోవ పట్టించేదిగా ఉందని జియో ఆ ఫిర్యాదులో పేర్కొంది.

RJio average download speed doubles in January: TRAI

 

రిలయన్స్ జియోతో అంతా ఆనందమే!
భారత అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ స్థాపించిన రిలయన్స్ జియోపై ఆది నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ సహచర టెలీకాం ఆపరేటర్లు చేసినవే. పేరుకే 4జీ వీవోఎల్‌టీఈ అయినప్పటికీ జియో ఇంటర్నెట్‌లో అంత దమ్ములేదని కనీసం 3జీ స్పీడు కూడా రావడంలేదని దేశంలో ప్రధానమైన మూడు టెలీకాం ఆపరేటర్లు ఆరోపించాయి. ఈ మేరకు టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌)కి కూడా ఫిర్యాదు చేసాయి. అయితే ఈ ఫిర్యాదులన్నింటికీ ట్రాయ్ సమాధానం ఇచ్చింది.
జనవరి మాసం ముగిసేనాటికి రిలయన్స్ జియో నెట్‌వర్క్ డౌన్‌లోడ్ వేగం రెండింతలైందని ట్రాయ్ వెల్లడించింది. సగటున సెకెనుకు 17.42 మెగాబిట్ స్పీడుతో డాటా డౌన్‌లోడ్ అవుతుందని చెప్పింది. ట్రాయ్ వివరాల ప్రకారం.. డిసెంబర్‌లో 8.34 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో ఇంటర్నెట్ స్పీడు జనవరికి వచ్చేసరికి 17.42 ఎంబీపీఎస్‌కు పెరిగింది. వాస్తవానికి ఈ స్పీడుతో మూడు నిమిషాల్లో ఒక సినిమాను డౌన్‌లోడ్ చేయొచ్చు.